నిర్మాతల వాదనపై వైజయంతి మూవీస్ రెస్పాన్స్ ఇదే..!

నిర్మాతల వాదనపై వైజయంతి మూవీస్ రెస్పాన్స్ ఇదే..!

Published on May 14, 2026 12:30 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రొడ్యూసర్ వర్సెస్ ఎగ్జిబిటర్ల వివాదానికి సంబంధించి ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ తమ మద్దతును ప్రకటించింది. సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం నిర్మాతలందరూ ఐకమత్యంగా ఉంటూ, సుస్థిరమైన పద్ధతులను అనుసరించాలని ఈ సంస్థ కోరింది.

పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లు ఆందోళనకరంగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితులను ప్రోత్సహించకూడదని వైజయంతి మూవీస్ స్పష్టం చేసింది. సినిమా రంగం వృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, వివాదాలు త్వరలోనే సామరస్యపూర్వకంగా పరిష్కారమవుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొంది.

ఇప్పటికే మైత్రీ రవి శంకర్, నాగవంశీ వంటి ప్రముఖ నిర్మాతలు ఎగ్జిబిటర్ల తీరును తప్పుబడుతూ, పరిశ్రమ కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఒత్తిళ్లు సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో వైజయంతి మూవీస్ కూడా తోటి నిర్మాతలకు అండగా నిలవడంతో ఈ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది.

తాజా వార్తలు