టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ తమ నెక్స్ట్ చిత్రాల అప్‌డేట్స్‌తో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను తొలుత భోపాల్‌లో నిర్వహించాలనుకున్నప్పటికీ, ఇప్పుడు వేదికను ముంబైకి మార్చారు. ఈ నెల 18న ముంబై వేదికగా అత్యంత గ్రాండ్‌గా ఈ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
మరోవైపు, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం నుంచి కూడా ఒక ప్రత్యేక గ్లింప్స్ రాబోతోంది. రామ్ చరణ్ ఈవెంట్ జరిగిన మరుసటి రోజే, అంటే మే 19న, మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను ముంబై లో మీడియాకు ప్రదర్శించనున్నట్లు సమాచారం. ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఇద్దరు హీరోలు ముంబై వేదికను ఎంచుకోవడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఒకే సమయంలో ఈ రెండు భారీ చిత్రాల అప్‌డేట్స్ వస్తుండటంతో సోషల్ మీడియాలో అభిమానుల సందడి పీక్స్ కు చేరనుంది. ఈ అప్‌డేట్స్ గనుక ప్రేక్షకులను మెప్పిస్తే, రెండు సినిమాల బిజినెస్‌కు మరియు హైప్‌కు పెద్ద ప్లస్ అవుతుంది. మరి ఈ ఇద్దరు హీరోలు తమ మూవీ అప్డేట్స్ తో ఎలాంటి క్లాష్ ఎదుర్కొంటారో చూడాలి.


