మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని జూన్ 4న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తుండగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న(మే 18) ఈ చిత్ర ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఇక విడుదలైన కొద్ది క్షణాల్లోనే ఈ చిత్ర ట్రైలర్ ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. యూట్యూబ్‌తో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో ఈ ట్రైలర్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న ‘పెద్ది’ ట్రైలర్ రికార్డు స్థాయిలో ఏకంగా 101 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. 24 గంటల్లో యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించిన తెలుగు ట్రైలర్‌గా పెద్ది తుక్కు రేపాడు. రామ్ చరణ్ ఊరమాస్ స్క్రీన్ ప్రెజెన్స్, గ్రాండ్ విజువల్స్ మరియు ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్‌ను నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్‌లో నిలిపాయి.
జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ట్రైలర్ సాధించిన ఈ భారీ రెస్పాన్స్‌తో పెద్ది సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
It is a RECORD BREAKING TAKEOVER 💥❤️🔥❤️🔥#PEDDITrailer Scores 101M+ Views for the Trailer 💥
ICYMI▶️https://t.co/8HqJUlMWDw#PEDDI in cinemas worldwide on 4th June.#GetReadyForPeddi 💥💥 pic.twitter.com/svN4wU6ttw
— Mythri Movie Makers (@MythriOfficial) May 19, 2026


