మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇపుడు తన కెరీర్ 158వ సినిమా కోసం సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. 7 పదుల వయసు వచ్చినా కూడా నిరంతర కృషీవలునిలా ఈ సినిమా కోసం చూపిస్తున్న డెడికేషన్ చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. దర్శకుడు కొల్లి బాబీ ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా గ్రాండ్ గా మే 21న ముహూర్త కార్యక్రమాలతో సినిమా ఆరంభం కానుంది.
ఇక ఈ గ్యాప్ లో ఒకో సాలిడ్ అప్డేట్ ని మేకర్స్ అందిస్తున్నారు. లేటెస్ట్ గా ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లని ఈ సినిమా కోసం తీసుకున్నట్టు ఖరారు చేశారు. మెగా వారసుడు రామ్ చరణ్ నుంచి ఇప్పుడు రాబోతున్న పెద్ది సినిమా కోసం ఒక ప్రత్యేక ప్రపంచాన్నే అవినాష్ సృష్టించారు. 20కి పైగా భారీ సెట్టింగ్ లను అత్యంత సహజంగా వేసి విజయనగరాన్ని మళ్ళీ సృష్టించిన తాను ఇపుడు మెగాస్టార్ సినిమా కోసం వర్క్ చేయనున్నట్టు మేకర్స్ బిగ్ అప్డేట్ అందించారు.
అయితే ఇదంతా ఓకే కానీ సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఒక మిస్టేక్ చేశారు. ఒరిజినల్ అవినాష్ కొల్ల సోషల్ మీడియా హ్యాండిల్ ని ట్యాగ్ చేయకుండా అదే పేరుతో ఉన్న ఎవరినో ట్యాగ్ చేసి పోస్టర్ మాత్రం ఒరిజినల్ అవినాష్ ది వేసి చేతులు దులుపుకున్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా నిర్లక్ష్యంగా ఉండడం ఏంటని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఇది పక్కన పెడితే ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నట్టు టాక్ ఉంది. అలాగే కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
Welcoming the architect of epic cinema, the visionary @artkolla, on board to shape the world of #Mega158 🪓❤️🔥
His vision and expertise will craft a MASSIVE cinematic world to celebrate MEGASTAR @KChiruTweets in his most ferocious avatar yet ✨🔥#ChiruBobby2 Pooja Ceremony on… pic.twitter.com/198NcslYlu
— KVN Productions (@KvnProductions) May 19, 2026


