సమీక్ష : ఫస్ట్‌ టైం – కొన్ని సన్నివేశాల్లో మాత్రమే మెప్పించే సైన్స్ ఫిక్షన్ డ్రామా!

సమీక్ష : ఫస్ట్‌ టైం – కొన్ని సన్నివేశాల్లో మాత్రమే మెప్పించే సైన్స్ ఫిక్షన్ డ్రామా!

Published on May 22, 2026 11:01 PM IST

విడుదల తేదీ : మే 22, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : సౌరభ్‌దింగ్ర, అఖిల్‌ సార్ధక్‌, అనిక్క విక్రమన్‌, మైమ్‌ గోపి, శివ, భూపాల్‌రాజు, గాయత్రి గుప్త తదితరులు.
దర్శకుడు : హేమంత్‌ ఇప్పలపల్లి
నిర్మాణం : హేమంత్‌ ఇప్పలపల్లి
సంగీతం : వెంకట్‌ అండ్‌ సూరజ్‌ ఎస్‌ కురుప్‌.
ఛాయాగ్రహణం : వేణు మురళీధర్‌, రామ్‌,
కూర్పు : హేమంత్‌ ఇప్పలపల్లి

సంబంధిత లింక్స్ : ట్రైలర్

సౌరభ్‌దింగ్ర, అఖిల్‌ సార్ధక్‌, అనిక్క విక్రమన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫస్ట్‌ టైం’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో హేమంత్‌ ఇప్పలపల్లి ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఈ రోజు రిలీజ్ అయ్యింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :-

ఈ కథ గురించి లోకాలకు  సంబంధించింది. తమ జాతిని విస్తరించాలనే లక్ష్యంతో ఇద్దరు గ్రహాంతరవాసులు భూమి మీదకు వస్తారు. ఈ క్రమంలో అక్కడ వారు అతీంద్రియ శక్తులను మరియు కొన్ని రహస్యాలను తెలుసుకుంటారు. ఈ ప్రయాణంలో అనేక సంఘటనల అనంతరం.. కాలేజీలో ఆద్య (అనిక్క విక్రమన్‌) వెనుకే  రాహుల్ (శివ కుమార్) పడుతూ ఉంటాడు. ఆమె అంటే అతనికి ఫుల్ ఆసక్తి ఉంటుంది. కానీ, ఆమెకు అతను అంటే ఇష్టం ఉండదు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య.. ఆద్య జీవితంలోకి ఆది (సౌరభ్‌దింగ్ర), ఆది (అఖిల్‌ సార్ధక్‌) వస్తారు. అసలు వాళ్లకు ఆద్యకి మధ్య సంబంధం ఏమిటి ?, ఆది, ఆద్యను తీసుకుని మరో ప్రపంచానికి ఎలా వెళ్తాడు ?, ఈ మధ్యలో వారిద్దరి మధ్య ఎలాంటి డ్రామా జరిగింది ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :-

నేచర్ పై వినూత్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో చాలా అంశాలు ఉన్నాయి. లోకం నాశనం దగ్గర నుంచి.. కొత్త ప్రపంచానికి సృష్టించేవరకూ ఈ సినిమా సాగింది. కథలో అనేక విషయాలతో పాటు అనేక రకాల నేపథ్యాలు కూడా ఉండటం.. ఆ నేపథ్యాలకు తగ్గట్టు విజువల్స్ కూడా ఉండటం.. మొత్తానికి ఈ సినిమా కొత్తగా సాగింది.ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. ప్రధాన పాత్రలో నటించిన సౌరభ్‌దింగ్ర  తన పాత్రలో ఒదిగిపోయారు. సీరియస్ సిచ్యుయేషన్స్ లో కూడా  తన టైమింగ్ తో అతను తన పాత్రను చాలా బాగా పండించారు.

అలాగే, అఖిల్‌ సార్ధక్‌ కూడా చక్కగా నటించాడు. హీరోయిన్ గా అనిక్క విక్రమన్‌  నటన ఆకట్టుకుంది. పైగా ఆమె చాలా గ్లామర్ గా కనిపించింది. అదేవిధంగా మైమ్‌ గోపి  పాత్రతో పాటు ఆయన డైలాగ్స్, ఆయన హావభావాలు బాగున్నాయి. శివ కుమార్ నటన బాగుంది. ఇతర కీలక పాత్రల్లో నటించిన భూపాల్‌రాజు, గాయత్రి గుప్త మరియు  మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :

ప్రపంచం నాశనం అయిపోవడం వంటి కథలు సినిమా తెరకి కొత్తేమీ కాదు. దీనికి తోడు విఎఫ్ఎక్స్  ఎఫెక్ట్స్ కూడా బాగా రెగ్యులర్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో  అలాంటి ఓ నేపథ్యంలో ఈ ఫస్ట్ టైమ్ టీమ్ వచ్చింది. ఆద్య – ఆది పాత్రల మధ్య ఏం జరిగింది ?, వారిద్దరూ మరో లోకాన్ని ఎలా సృష్టించారు ?  అనే కోణంలో సాగే సీన్స్ బాగానే ఉన్నా.. సన్నివేశాలు చాలా స్లోగా సాగాయి.

అలాగే అసలు కథలోని మెయిన్ మోటివ్ బాగా వర్కౌట్ అయ్యి ఉంటే బాగుండేది. ప్రధానంగా కాన్ ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం, ఇక మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరో క్యారెక్టర్ తాలూకు గ్రాఫ్ కూడా బాగాలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. అయితే దర్శకుడు ఫస్ట్ హాఫ్ పై ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ.. సినిమాలో కొన్ని చోట్ల లాజిక్ మిస్ కావడం, ఇంట్రెస్టింగ్ ప్లే లేకపోవడం అంశాల కారణంగా సినిమా బాగాలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ముందే చెప్పుకున్నట్లు దర్శకుడు హేమంత్‌ ఇప్పలపల్లి  టేకింగ్ బాగుంది. అయితే, మంచి కంటెంట్ రాసుకోవడంలో విఫలం అయ్యారు. ఆయన రాసిన స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా లేదు. సంగీత దర్శకుడు వెంకట్‌ అండ్‌ సూరజ్‌ ఎస్‌ కురుప్‌  అందించిన సంగీతం పర్వాలేదు. ఐతే సెకండ్ హాఫ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్  మాత్రం కొన్ని కీలక సన్నివేశాల్లో ఆకట్టుకునేలా లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఇక ఎడిటర్ ఎడిటింగ్ వర్క్ కూడా పర్వాలేదు. నిర్మాత హేమంత్‌ ఇప్పలపల్లి  నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

తీర్పు :

‘ఫస్ట్‌ టైం’ అంటూ విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రధానంగా  వచ్చిన ఈ సినిమాలో.. కొన్ని విజువల్స్, కొన్ని ఎమోషనల్ అండ్ లవ్ సీన్స్ మరియు మెయిన్ కాన్సెప్ట్ బాగున్నాయి. కానీ, స్క్రీన్ ప్లేలో  ఇంట్రెస్టింగ్ డ్రామా మిస్ కావడం, కొన్ని చోట్ల స్లో నేరేషన్, మరియు బోరింగ్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి.  ఓవరాల్ గా ఈ ‘ఫస్ట్‌ టైం’ సినిమాలో విజువల్స్ బాగున్నా.. సినిమా మాత్రం అంతగా మెప్పించలేదు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు