ఇప్పుడు టాలీవుడ్ సినిమా దగ్గర వస్తున్న పలు పాన్ ఇండియా సినిమాలు మన స్టార్ హీరోస్ తీసుకుంటున్న డేరింగ్ స్టెప్పులు పైగా కంటెంట్ కూడా ఏ విధంగా ఉంటుందో మనం చూస్తూనే వస్తున్నాం. అయితే ఈ గడిచిన కొన్నేళ్లలో బాగా నోటెడ్ అయినటువంటి చిత్రాలు కొన్ని కనిపిస్తాయి. ఇంట్రెస్టింగ్ గా ఆ సినిమాలూ అన్నీ ఒకటే ఫార్మాట్ లో తెరకెక్కడం విశేషం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప నుంచి మొన్న రామ్ చరణ్ పెద్ది అలాగే ఇప్పుడు రాబోతున్న అవైటెడ్ సినిమా ది ప్యారడైజ్ మూడిట్లో కూడా ఒకటే కామన్ పాయింట్ కనిపిస్తుంది. అదే ‘గుర్తింపు’. తనకో, తన ఊరికో, తమ ప్రజల ఉనికికో కావాల్సిన గుర్తింపు పైనే ఈ మూడు సినిమాలూ తెరకెక్కాయి. పుష్ప వచ్చిన తర్వాత పెద్ది సినిమాకి కూడా గుర్తింపు కోసం పోరాటం అంటే పుష్ప లానే ఉంటుందా ఏమో అని కొందరు భావించారు.
కానీ పెద్ది అందుకు విభిన్నంగా వచ్చి అంతకు మించిన హిట్ అయ్యింది. ఇప్పుడు నాని ప్యారడైజ్ లో కూడా అదే గుర్తింపు కోసం జరిగే పోరాటం ప్రధాన ఎలిమెంట్ గా వస్తున్నట్టు శ్రీకాంత్ ఓదెల అండ్ టీం తెలిపారు. సో ఒకటే ఫార్మాట్ లో ఇవి తెరకెక్కాయి అని చెప్పవచ్చు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ ఏంటంటే గుర్తింపు కోసం తెరకెక్కించబడ్డ ఈ సినిమాల మొదటి అక్షరాలు అన్నీ ‘ప’ పదాలతోనే మొదలయ్యాయి.
పుష్ప, పెద్ది, ప్యారడైజ్.. ఇక్కడా కలిసాయి. సో సెంటిమెంట్ ప్రకారం ఆ రెండు పెద్ద హిట్ అయినట్టు గానే ప్యారడైజ్ కూడా రీసౌండింగ్ హిట్ అవుతుందేమో తెలియాలి అంటే ఈ సెప్టెంబర్ 23 సాయంత్రం వరకు ఆగాల్సిందే.


