SRH vs RCB: ఊచకోత కోసిన సన్‌రైజర్స్ బ్యాటర్లు.. మ్యాచ్ గెలిచినా క్వాలిఫైయర్-1 బెర్త్ మిస్ చేసుకున్న హైదరాబాద్!

SRH vs RCB: ఊచకోత కోసిన సన్‌రైజర్స్ బ్యాటర్లు.. మ్యాచ్ గెలిచినా క్వాలిఫైయర్-1 బెర్త్ మిస్ చేసుకున్న హైదరాబాద్!

Published on May 23, 2026 12:08 AM IST

ముఖ్య అంశాలు

  • సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 55 పరుగుల భారీ తేడాతో ఆర్సీబీ ఓటమి చవిచూసింది.
  • ఈ మ్యాచ్‌కు ముందు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న బెంగళూరు.. ఓడిపోయినా మెరుగైన నెట్ రన్‌రేట్‌తో ఆ స్థానాన్ని విజయవంతంగా కాపాడుకుంది.
  • 256 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 200 పరుగులు చేయగలిగింది.. దీంతో ఎస్‌ఆర్‌హెచ్, గుజరాత్ కంటే నెట్ రన్‌రేట్ అగ్రభాగంలో ఉండి నెంబర్ వన్ ప్లేస్‌ను నిలబెట్టుకుంది.

ఐపీఎల్ 2026 లీగ్ దశ ఆఖరి మ్యాచులు అభిమానులకు అసలైన టీ20 మజాను పంచుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన పోరులో పరుగుల సునామీ సృష్టించిన ఎస్‌ఆర్‌హెచ్‌ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇరు జట్ల బ్యాటర్లు పోటీ పడి బౌండరీలు బాదడంతో ఉప్పల్ స్టేడియం హోరెత్తింది.

తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ ముగ్గురూ హాఫ్ సెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోరు నమోదైంది. ముఖ్యంగా ఇషాన్ కిషన్ ఊచకోత ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించింది. ఈ అద్భుత ఇన్నింగ్స్‌కు గానూ అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది.

భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ తడబడింది. అయితే ఇక్కడే బెంగళూరు జట్టు వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మ్యాచ్ గెలవడం కష్టమని తెలిసిన తర్వాత, తమ నెట్ రన్‌రేట్ మరీ దారుణంగా పడిపోకుండా జాగ్రత్తపడింది. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆర్సీబీ.. భారీ తేడాతో ఓడిపోతే ఆ స్థానం గల్లంతయ్యే ప్రమాదం ఉండేది. కానీ కనీస స్కోరు చేయడం ద్వారా గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కంటే మెరుగైన నెట్ రన్‌రేట్‌ను మెయింటైన్ చేయగలిగింది.

ఫలితంగా 18 పాయింట్లతోనే ఉన్నప్పటికీ.. టాప్ ప్లేస్‌ను ఎవరికీ వదులుకోకుండా సక్సెస్‌ఫుల్‌గా డిఫెండ్ చేసుకుంది. మరోవైపు అద్భుతమైన విక్టరీ సాధించిన సన్‌రైజర్స్ సైతం 18 పాయింట్లతో లీగ్ దశను ముగించినా.. రన్‌రేట్ లెక్కల్లో మూడో స్థానానికి పరిమితమైంది. దీంతో ఆర్సీబీ దర్జాగా గుజరాత్ టైటాన్స్‌తో పాటు క్వాలిఫైయర్-1కు సిద్ధమైంది. ఓడినా టేబుల్ టాపర్‌గా నిలవడం బెంగళూరు అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు