మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న క్రేజీ పాన్ వరల్డ్ స్కేల్ చిత్రమే “డ్రాగన్”. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎన్నో అంచనాలు సెట్ చేసుకొని ఎదురు చూస్తున్న ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ నుంచి ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ మొదటి రోజే రికార్డు రెస్పాన్స్ అందుకుంది. ఇక లేటెస్ట్ గా సినిమా ఫస్ట్ గ్లింప్స్ మరో బిగ్గెస్ట్ రికార్డు సెట్ చేసినట్టు మేకర్స్ చెబుతున్నారు.
ఈ గ్లింప్స్ ఇపుడు ఏకంగా 100 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసినట్టుగా మేకర్స్ తెలిపారు. డిజిటల్ గా ఎన్టీఆర్ విధ్వంసం 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి ఇప్పటికీ దూసుకెళ్తుంది. దీనితో తారక్ మేనియా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ స్కేల్ తో అంతర్జాతీయ లెవెల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది జూన్ 11న సినిమా విడుదల కానుంది.
And this #DRAGON has only ONE HEAD!!!!
And the rampage it has unleashed is unreal 🐉
100M+ Digital Views & Counting.#DragonGlimpse pic.twitter.com/3F3zsS2qS1
— Dragon (@DragonMovieOffl) May 23, 2026


