ఇప్పుడు టాలీవుడ్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రమే “పెద్ది”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాని దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో నటించారు. అయితే ఈ సినిమా విషయంలో మొదటి నుంచీ వచ్చిన ప్రతీ కంటెంట్ సూపర్ హిట్ అయ్యింది. కానీ రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో మాత్రం ఆడియెన్స్, అభిమానులు వంద శాతం శాటిస్ఫై అవ్వలేదు అనే కామెంట్స్ అధికంగా వినిపించాయి.
దీనితో డెఫినెట్ గా పెద్ది సినిమాకి ఇంకో ట్రైలర్ కట్ కావాల్సిందే అని కోరారు. అయితే ప్రస్తుతానికి రెండో ట్రైలర్ ఆలోచనలు లేనట్టే కనిపిస్తున్నాయి. లేదా తెలుగులో గ్రాండ్ ప్రీరిలీజ్ సమయానికి ఏమన్నా కొత్త ట్రైలర్ ని దింపుతారేమో చూడాలి. దాదాపు మన దగ్గర ఇదే స్ట్రాటజీ నడుస్తుంది. సో ఇప్పుడు పెద్ది రెండో ట్రైలర్ ఆలోచనలు లేకపోయినా రిలీజ్ టైం కి డెఫినెట్ గా ఆ ఛాన్స్ ఉంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.


