బ్లాక్ బస్టర్ రోమ్ కామ్ ‘ప్రేమలు’ సీక్వెల్ పై షాకింగ్ ట్విస్ట్!

బ్లాక్ బస్టర్ రోమ్ కామ్ ‘ప్రేమలు’ సీక్వెల్ పై షాకింగ్ ట్విస్ట్!

Published on May 30, 2026 8:03 AM IST

మలయాళ సినిమా నుంచి వచ్చిన పలు సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో కొన్నాళ్ల కితం వచ్చిన బ్లాక్ బస్టర్ రోమ్ కామ్ చిత్రం “ప్రేమలు” కోసం తెలుగు ఆడియెన్స్ కి కూడా బాగా తెలుసు. తెలుగులో కూడా సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంలో నెస్లన్, మమిత బైజులు హీరో హీరోయిన్స్ గా నటించగా గిరీష్ ఏడి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాకి తర్వాత సీక్వెల్ ని కూడా అనౌన్స్ చేశారు కానీ అక్కడ నుంచి మళ్ళీ పత్తా లేకుండా పోయింది ఈ ప్రాజెక్ట్.

కానీ లేటెస్ట్ గా ఈ బ్లాక్ బస్టర్ సీక్వెల్ పై ఓ క్లారిటీని సినిమా యంగ్ హీరో నెస్లన్ అందించాడు. ఊహించని ట్విస్ట్ ఇస్తూ ఈ సినిమా ఆగిపోయినట్టు ఖరారు చేసాడు. స్క్రిప్టింగ్ లోనే పలు సమస్యలు ఉన్న కారణంగా సినిమా ఆగిపోయినట్టు ఓ ఇంటర్వ్యూలో ఖరారు చేసాడు. సో ఇది ప్రేమలు ఫ్యాన్స్ కి మాత్రం బాగా డిజప్పాయింటింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాని ఫహద్ ఫాజిల్ నిర్మాణం వహించగా విష్ణు విజయ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు