మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన మల్టీస్పోర్ట్స్ డ్రామా చిత్రమే “పెద్ది”. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ ఎమోషనల్ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఓవర్సీస్ మార్కెట్ లో బుకింగ్స్ ఓపెన్ చేసుకున్న సంగతి తెలిసిందే. అలా యూఎస్ మార్కెట్ నార్త్ అమెరికాలో పెద్ది ఇపుడు మంచి గ్రోత్ ని చూస్తుంది అని చెప్పాలి.
ఇలా లేటెస్ట్ ఒక్క రోజులో 50 వేల డాలర్స్ గ్రాస్ ని అందుకుంది. దీంతో మొన్నటికి నిన్నటికి 6 లక్షల నుంచి 6 లక్షల 50 వేల డాలర్స్ గ్రాస్ ని చేరుకొని ఇపుడు 7 లక్షల మార్క్ కి దూసుకెళ్తుంది. ఇదే కంటిన్యూ అయితే ఈజీగా 1.5 మిలియన్ డాలర్స్ కి చేరినా ఎలాంటి ఆశ్చర్యం లేదు. సో పెద్ది ప్రీ సేల్స్, ప్రీమియర్స్ వసూళ్లు ఎక్కడ వరకు వెళ్లి ఆగుతాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా వృద్ధి సినిమాస్ నిర్మణం వహిస్తున్నారు. అలాగే ఈ జూన్ 4న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.



