కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కంబ్యాక్ హిట్ ని దర్శకుడు ఆర్జే బాలాజీ ఫైనల్ గా కరుప్పు/వీరభద్రుడు సినిమాతో అందించాడు. తిప్పి కొడితే సూర్య 300 కోట్ల క్లబ్ లోకి చేరి సాలిడ్ వసూళ్లు, బుకింగ్స్ తో ఇప్పటికీ నిలకడ కొనసాగిస్తున్నాడు. ఇలా తనకి సెన్సేషనల్ సక్సెస్ ఇచ్చిన కీలక పాత్రధారులకి సూర్య తన తరపు నుంచి ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్ లని అందిస్తున్నారు.
లేటెస్ట్ గా సినిమా సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ కి కూడా సూర్య ఖరీదైన సర్ప్రైజ్ ని అందించగా సాయి దానిని సోషల్ మీడియాలో పంచుకొని ఆనందం వ్యక్తం చేస్తూ సూర్యకి థాంక్స్ చెప్పుకొచ్చాడు. అయితే సూర్య సాయి అభ్యంకర్ కోసం మహీంద్రా నుంచి లేటెస్ట్ లగ్జరీ ఎక్స్ యూ వి కార్ ని బహుమతిగా అందించారు. దీని ధర మార్కెట్ లో 28 లక్షలకి పైగానే ఉంది. దీనితో తనకి సూర్య ఇచ్చిన ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ వైరల్ గా మారింది.
Love you @Suriya_offl sir ♥️@rajsekarpandian ♥️@prabhu_sr ♥️ pic.twitter.com/wkj35tJAAS
— abhyankkar (@SaiAbhyankkar) May 31, 2026


