‘సాహో’తో మిస్సైన కిక్ ‘స్పిరిట్’ ఇవ్వబోతుందా? రెబల్స్ గెట్ రెడీ

‘సాహో’తో మిస్సైన కిక్ ‘స్పిరిట్’ ఇవ్వబోతుందా? రెబల్స్ గెట్ రెడీ

Published on May 31, 2026 10:00 PM IST

saaho-AND-spirit

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తనకి బాహుబలి సినిమాల తర్వాత ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఇంట్రెస్టింగ్ జానర్ లలో క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తూ వచ్చారు. అయితే ఈ లైనప్ లో కొన్ని ప్లాప్ లు కూడా పడ్డప్పటికీ ప్రభాస్ క్రేజ్, మార్కెట్ చెక్కు చెదరలేదు. అలాంటి ప్లాప్ లలో కూడా భారీ వసూళ్లు సాధించినవి ఉన్నాయి. మరి ఆ చిత్రాల్లో సాలిడ్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా ‘సాహో’ కూడా ఒకటి.

యంగ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమాలో బాగా డిజప్పాయింట్ చేసిన విషయాల్లో ప్రభాస్ ని పోలీస్ యూనిఫామ్ లో చూపించకపోవడం అని కూడా చెప్పొచ్చు. ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారి పోలీస్ గా కనిపిస్తాడమే ఎగ్జైట్మెంట్ అప్పట్లో అభిమానుల్లో అంతా ఇంతా కాదు.

కానీ సింపుల్ గా ప్రభాస్ అందులో కనిపిస్తాడు. కానీ ఆ ఆకలి ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ తో తీర్చబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ అని అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రభాస్ పైనే పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫిసర్ కాస్ట్యూమ్ లో కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి ప్రభాస్ ని ఇలా చూడాలి అనుకునే కోరిక స్పిరిట్ తో తీరబోతుంది అని చెప్పవచ్చు.

తాజా వార్తలు