బన్నీ ‘రాకా’ పై మరో క్రేజీ రూమర్ !

బన్నీ ‘రాకా’ పై మరో క్రేజీ రూమర్ !

Published on Jun 2, 2026 1:08 PM IST

raaka

‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా ‘రాకా’ అప్ డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, మలయాళ బ్యూటీ ఫెమినా జార్జ్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తోంది. ఇప్పటికే ఆమె ‘రాకా’ యూనిట్ లో చేరింది. వచ్చే షెడ్యూల్ లో ఈ మూవీ టీమ్ లోకి మరో హీరోయిన్ కూడా వచ్చి చేరనుంది. సినిమాలో మంచి ఎమోషన్స్ ఉన్నాయని.. పైగా పాత్రలు కూడా ఎక్కువ ఉన్నాయని.. త్వరలోనే మరో యంగ్ హీరోయిన్ కూడా ఓ ఎమోషనల్ పాత్రలో నటించబోతుందని తెలుస్తోంది.

ప్రస్తుతం రాకా షూటింగ్ ముంబయిలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో నడుస్తోంది. బన్నీ ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కాగా భారీ స్థాయిలో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుందట. ఈ మూవీలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అన్నట్టు ఈ సినిమాలో దీపికా పడుకోణెతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, జాన్వీ కపూర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది.

కాగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. అన్నట్టు సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.

తాజా వార్తలు