ఇప్పుడు ఇండియన్ సినిమా కంటెంట్ ప్రపంచ వ్యాప్త ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యే రీతిలో స్టాండర్డ్స్ పెంచుకుంటూ వెళుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్లానింగ్ లలో మన టాలీవుడ్ స్టార్ హీరోలు దాదాపు గట్టి లైనప్ తో ముందు వరుసలో ఉన్నారు. డైరెక్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ కంటెంట్ ని పట్టుకొని ప్రభాస్, అల్లు అర్జున్ అలాగే మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తమ కల్కి, వారణాసి అలాగే రాకా, డ్రాగన్ లాంటి సినిమాలతో ప్రపంచ సినిమానే టార్గెట్ గా కరెక్ట్ ప్లాన్ గీసుకుంటున్నారు.
ఇంకోపక్క కన్నడ సినిమా నుంచి యష్ కూడా తన టాక్సిక్ సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ వీరందరితోనే ఉన్న మరో స్టార్ రామ్ చరణ్ మాత్రం ఒకింత వెనుకబడ్డాడు అనే చెప్పాలి. RRR అనే సినిమాతో గ్లోబల్ లెవెల్లో మంచి రీచ్ ని తాను సొంతం చేసుకున్నాడు. కానీ మిగతా హీరోస్ లా ఓ రేంజ్ లైనప్ లేదని ఫ్యాన్స్ నిరుత్సాహ పడుతున్నారు.
ఇప్పుడు వరకు చెప్పుకున్న స్టార్ హీరోస్ లో నెక్స్ట్ సినిమాల లైనప్ కూడా ఉంది కానీ చరణ్ నుంచి ప్రస్తుతానికి సుకుమార్ ప్రాజెక్ట్ మాత్రమే అధికారికంగా అనౌన్స్ అయ్యింది. దీనితో కేవలం లోకల్ ఆడియెన్స్ వరకు మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్ గా చరణ్ తన ఛరిష్మా విస్తరించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సో చరణ్ నుంచి నెక్స్ట్ ఎలాంటి కాంబినేషన్ లు ఉంటాయో చూడాలి.


