పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే ఇక్కడి విమల్ థియేటర్ ఓపెన్ గ్రౌండ్‌లో ఎలాంటి లీకులు రాకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
ఈ షెడ్యూల్‌లో సీనియర్ నటి నదియా కూడా జాయిన్ అయ్యింది. 2013లో సూపర్ హిట్ మూవీ ‘మిర్చి’ తర్వాత మళ్లీ ప్రభాస్‌తో కలిసి ఆమె నటిస్తుండటం విశేషం. ప్రస్తుతానికి ఆమె పాత్ర వివరాలను సస్పెన్స్‌గా ఉంచినప్పటికీ, ఈ ‘మిర్చి’ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్‌గా, తృప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్నారు. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2027 మార్చి 5న గ్రాండ్‌గా విడుదల కానుంది.


