‘మ్యాడ్’ హీరో రామ్ నితిన్ కొత్త చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే..?

‘మ్యాడ్’ హీరో రామ్ నితిన్ కొత్త చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే..?

Published on Jun 4, 2026 6:08 PM IST

‘సుందరాకాండ’ ఫేమ్ దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో యంగ్ హీరో రామ్ నితిన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించాడు. ఈ కొత్త చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ జోనర్‌లో తెరకెక్కుతోంది. ధీరజ్ మొగిలినేని ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర అనౌన్స్‌మెంట్ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ చాలా కలర్‌ఫుల్‌గా, పండుగ వాతావరణాన్ని తలపించేలా వైబ్రెంట్‌గా ఉంది. ఈ సినిమాకు సింజిత్ యెర్రమిల్లి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఒక మంచి యూత్‌ఫుల్ కథాంశంతో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు