‘చిరు158’ షూటింగ్‌పై సాలిడ్ అప్డేట్..!

‘చిరు158’ షూటింగ్‌పై సాలిడ్ అప్డేట్..!

Published on Jun 4, 2026 11:02 PM IST

Chiru-Bobby

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న ‘చిరు158’ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈ క్రేజీ కాంబో మళ్లీ చేతులు కలపడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం, ఈ బ్యానర్ నుంచి వస్తున్న తొలి తెలుగు సినిమా కావడం విశేషం.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని పొల్లాచ్చిలో శరవేగంగా జరుగుతోంది. ఈ కీలక షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటుండగా, ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదే సమయంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ‘చిరు-బాబీ 2’ యూనిట్ విడుదల చేసిన స్పెషల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది.

దర్శకుడు బాబీ ఈ చిత్రం కోసం చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్, ఇంటెన్స్ రోల్‌ను సిద్ధం చేయగా, అందుకోసం మెగాస్టార్ అద్భుతమైన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యాడు. టాప్ టెక్నికల్ టీమ్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా.. కోన వెంకట్, చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ మరియు ఇతర నటీనటుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు