ఇప్పుడు మన టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో వెంకీ మామ కూడా వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తన బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఆదర్శ కుటుంబం అనే ఫ్యామిలీ యాక్షన్ డ్రామా తను చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్ మధ్యలో యాడ్ అయ్యిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు థమన్ ఈ సినిమా మ్యూజిక్ పనుల్లోనే బిజీగా ఉన్నట్టు అప్డేట్ అందించాడు. కానీ అభిమానులు మాత్రం అంత పాజిటివ్ గా అయితే లేరు. సినిమాని ఈ ఏడాది వేసవి రిలీజ్ కి ప్రామిస్ చేశారు. కానీ విడుదల చేయలేదు. దీనితో ఈ అప్డేట్స్ కాదు రిలీజ్ ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు. సో దీనిపై ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇక ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


