త్రిగుణ్ ‘జంగా’ నుంచి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల

త్రిగుణ్ ‘జంగా’ నుంచి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల

Published on Jun 8, 2026 8:00 AM IST

త్రిగుణ్, నేహా పఠాన్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ‘జంగా’. కెవిన్ గడ్డం (శ్రీహరి) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. త్రిగుణ్ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం ఈ సినిమా నుంచి ప్రత్యేక పోస్టర్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది.

ఈ మోషన్ పోస్టర్‌లో త్రిగుణ్ తన మునుపటి చిత్రాలకు భిన్నంగా సరికొత్త గెటప్‌లో కనిపించారు. శ్రీమతి వనిత కిలారి సమర్పణలో ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శ్రావణ్, మధునందన్, గగన్ విహారి, చందు గౌడ, రఘు కారుమంచి, రచ్చ రవి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉందని నిర్మాతలు వెల్లడించారు. ఈ చిత్రానికి కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తుండగా, వెంకట్ సి. దిలీప్ సినిమాటోగ్రాఫర్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు