సూర్య ల్యాండ్‌మార్క్ మూవీకి ఆ డైరెక్టర్ ఫిక్స్..?

సూర్య ల్యాండ్‌మార్క్ మూవీకి ఆ డైరెక్టర్ ఫిక్స్..?

Published on Jun 11, 2026 2:00 AM IST

Suriya-And-Anil-Ravipudi

‘కరుప్పు’ విజయంతో మంచి జోష్‌లో ఉన్న కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తన 46వ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ను రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయనున్నారు. ఇక ఆ తర్వాత జీతూ మాధవన్ దర్శకత్వంలో ‘సూర్య 47’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. వీటితో పాటు సూర్య లైనప్‌లో పా రంజిత్, టి.జె.జ్ఞానవేల్ కూడా ఉన్నారు.

ఇదిలా ఉంటే.. సూర్య కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ల్యాండ్‌మార్క్ 50వ చిత్రాన్ని టాలీవుడ్ మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో తెరకెక్కించబోతున్నారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన చర్చలు చివరి దశకు చేరాయని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

అనిల్ రావిపూడి కమర్షియల్ ట్రాక్ రికార్డ్ ఈ మైల్‌స్టోన్ సినిమాకు ప్లస్ అవుతుందని కొందరు అంటుంటే, సూర్య వరుసగా పరభాషా దర్శకులకే అవకాశాలు ఇవ్వడంపై కోలీవుడ్‌లో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. మరి నిజంగానే సూర్య తన 50వ చిత్రాన్ని అనిల్ రావిపూడితో చేస్తాడా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు