ఈ ఓటిటిలోకి వచ్చేసిన విశాల్ ‘మకుటం’.. ఇక్కడైనా రిజల్ట్ మారుతుందా?

ఈ ఓటిటిలోకి వచ్చేసిన విశాల్ ‘మకుటం’.. ఇక్కడైనా రిజల్ట్ మారుతుందా?

Published on Sep 11, 2026 11:32 AM IST

కోలీవుడ్ మాస్ యాక్షన్ హీరో విశాల్ హీరోగా దుశరా విజయన్ హీరోయిన్ గా విశాల్ నే దర్శకునిగా చేసిన చిత్రమే ‘మకుటం’. తమిళ్ లో మగుడం గా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేశారు. అయితే ఈ సినిమా తోనే విశాల్ దర్శకునిగా భాద్యతలు తీసుకొని 3 గంటల ఫుటేజ్ ని తెరకెక్కించి విడుదల చేసాడు.

కానీ సీన్ కట్ చేస్తే అటు తమిళ్, ఇటు తెలుగు రెండిట్లో కూడా సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. దీనితో థియేటర్స్ నుంచి సినిమా తీసేయడానికి కూడా ఎక్కువ సమయం పట్టలేదు. ఇక ఎలాగో ఈ సినిమాకి ఓటిటి డీల్ అయితే చేసుకోగలిగారు. ఫైనల్ గా సినిమా ఓటిటిలో కూడా నేటి నుంచే వచ్చేసింది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళ్, తెలుగు, కన్నడ అలాగే మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. సో ఈ చిత్రం ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి మరి. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. అలాగే విశాల్, ఆర్బీ చౌదరి నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు