‘థాంక్యూ సుబ్బారావు’ ఫస్ట్ లుక్, టీజర్ విడుదల

‘థాంక్యూ సుబ్బారావు’ ఫస్ట్ లుక్, టీజర్ విడుదల

Published on Jun 11, 2026 8:00 AM IST

దర్శకుడు చెందు ముద్దు తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘థాంక్యూ సుబ్బారావు’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. కుర్ర ప్రొడక్షన్స్ పతాకంపై దినేష్ కుర్ర నిర్మిస్తున్న ఈ చిత్రంలో చంద్రహాస్ కోట్ల, లావణ్య సాహుకార ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కె. రాఘవేంద్ర రెడ్డి ఈ సినిమాను సమర్పిస్తున్నారు.

ఈ టీజర్‌ను గమనిస్తే కామెడీ, యాక్షన్, ప్రేమ, సస్పెన్స్ అంశాలతో సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మురళీధర్ గౌడ్ సంభాషణలు, రైలు ప్రయాణంలో సాగే సస్పెన్స్ సన్నివేశాలను ఇందులో ఆసక్తికరంగా చూపించారు. రోహిత్ రెడ్డి యర్రంరెడ్డి, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రిన్స్ హెన్రీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పంకజ్ తొట్టాడ ఛాయాగ్రహణ బాధ్యతలు తీసుకున్నారు. డి. వెంకట్ ప్రభు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర బృందం పేర్కొంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు