పెద్ది : రిలోడ్ వెర్షన్ వచ్చేస్తుంది.. నేటి నుంచి సరికొత్తగా..!

పెద్ది : రిలోడ్ వెర్షన్ వచ్చేస్తుంది.. నేటి నుంచి సరికొత్తగా..!

Published on Jun 18, 2026 7:00 AM IST

Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ సరికొత్త వెర్షన్‌తో థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా రీలోడెడ్ (కొత్త సీన్లు జోడించిన) వెర్షన్‌ను నేటి నుంచే థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

​ఈ సరికొత్త వెర్షన్‌లో దాదాపు 5 నిమిషాల 56 సెకన్ల నిడివి గల అదనపు దృశ్యాలను జత చేశారు. ఇందులో ముఖ్యంగా హీరోయిన్ జాన్వీ కపూర్‌కు సంబంధించిన కొన్ని సీన్స్‌తో పాటు, సీనియర్ నటుడు జగపతి బాబు నటించిన ఒక కీలకమైన సన్నివేశాన్ని యాడ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఐదున్నర నిమిషాల ఎక్స్‌ట్రా ఫుటేజ్ సినిమాకు ఏ మేరకు అదనపు బలాన్ని ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

​వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ భారీ చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. మరి ఈ కొత్త సీన్ల జోడింపుతో ‘పెద్ది’ రీలోడెడ్ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను సాధిస్తుందో, ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు