స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్‌లో నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం యావరేజ్ టాక్‌తోనే ట్రేడ్ అంచనాలను మించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఎక్కడా బోర్ కొట్టించని క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. సినిమాకు ఉన్న పాజిటివ్ బజ్ కారణంగా ప్రస్తుతం ఈ చిత్రం ఒక మిడ్ రేంజ్ స్టార్ హీరో రేంజిలో కలెక్షన్లు రాబడుతోంది.
ఈ చిత్రంలో సమంత తన పెర్ఫామెన్స్‌తో అదరగొట్టగా, ఆమె స్నేహితురాలి పాత్రలో నటించిన కొత్త నటి మంజూష ముక్కవిల్లి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పల్లెటూరి ఉమ్మడి కుటుంబంలో వంట తెలియక ఇబ్బంది పడే స్నేహితురాలి కోసం.. భర్తను విడిచిపెట్టి మరీ తన స్నేహితురాలికి సాయం చేసే అమాయకపు గడుసు పాత్రలో ఆమె భలేగా నటించింది. ఆమె నటనకు, ఆమె పాత్రకు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఓవర్‌నైట్‌లో ఆమెకు పాపులారిటీ పెరిగిపోయింది.
రీల్స్ ద్వారా దర్శకురాలు నందిని రెడ్డి దృష్టిలో పడి ఈ అవకాశం దక్కించుకున్న మంజూష, తొలి సినిమాతోనే ఎంతో అనుభవం ఉన్న నటిలా ఎక్స్‌ప్రెషన్స్ పలికించి మార్కులు కొట్టేసింది. లభించిన క్రేజీ ఛాన్స్‌ను రెండు చేతులా అందిపుచ్చుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీకి మున్ముందు టాలీవుడ్‌లో మంచి భవిష్యత్తు ఉంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.


