‘బ్లడీ రోమియో’ టెస్ట్ షూట్ పాస్.. ఇక నానిదే ఆలస్యం..!

‘బ్లడీ రోమియో’ టెస్ట్ షూట్ పాస్.. ఇక నానిదే ఆలస్యం..!

Published on Jun 22, 2026 8:58 PM IST

న్యాచురల్ స్టార్ నాని, ‘ఓజి’ దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో రాబోతున్న స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ ‘బ్లడీ రోమియో’ ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్రంలో ఎక్కువ భాగం లండన్‌లో షూట్ చేయనుండగా, సుజీత్ అండ్ టీం ఇప్పటికే లొకేషన్లను ఫైనల్ చేసింది. నాని ప్రస్తుతం నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ విడుదలైన వెంటనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.

ఇటీవలే ముంబైలో చిత్ర యూనిట్ ఒక యాక్షన్ స్టంట్ టెస్ట్ షూట్ నిర్వహించగా, ఆ అవుట్‌పుట్ చూసి నాని ఎంతో ఇంప్రెస్ అయ్యాడట. ఈ ఏడాది దసరా తర్వాత ‘బ్లడీ రోమియో’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను 2027 వేసవి కానుకగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాలో మాలీవుడ్ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ‘శ్యామ్ సింగ రాయ్’ తర్వాత నాని, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబోలో వస్తున్న రెండో చిత్రం కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి.

తాజా వార్తలు