‘ఓజి 2’ లో పెట్ డ్రాగన్.. చాలా ఎక్కువ ఊహించేసుకుంటున్నారా?

‘ఓజి 2’ లో పెట్ డ్రాగన్.. చాలా ఎక్కువ ఊహించేసుకుంటున్నారా?

Published on Jun 26, 2026 11:40 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసునున్న సెన్సేషనల్ ప్రీక్వెల్ సినిమా ఓజి 2 పట్ల ఉన్న హైప్ ఇప్పుడు అంతా ఇంతా కాదు. భారీ బడ్జెట్ తో ఈసారి స్వయంగా పవన్ నిర్మాణం వహించనున్న ఈ స్పెషల్ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు సుజీత్ ప్రత్యేకంగా ప్లాన్స్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం వచ్చిన డిస్కషన్ లో మీకోక పెట్ డ్రాగన్ ఉంటుంది అంటూ సుజీత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ ని వెర్రెత్తేలా చేస్తున్నాయి.

కానీ ఇక్కడ చాలా మంది రియాలిటీ మర్చిపోయి ఎక్కువ ఊహించుకొని తప్పుడు అంచనాలు పెట్టుకుంటున్నారు అనిపిస్తుంది. పెట్ డ్రాగన్ అంటే అదేదో నిజంగానే డ్రాగన్ ని సినిమాలో ఓజి పెంచుకుంటాడు అని అనేసుకుంటున్నారు. కానీ నిజానికి అక్కడ అదేం ఉండదు. అసలు ఈ రియాలిటీ ప్రపంచంలో డ్రాగన్ అనేదే ఒక నమ్మకం. అది కూడా చైనీయుల పురాణాల్లో ఉండే ఒక నమ్మకం. సో ఈ పీరియాడిక్ యాక్షన్ సినిమాలో ఫాంటసీని నైస్ గా ఫ్యాన్స్ ఇరికించుకుంటున్నారు. సో ఈ రియాలిటీని వారు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. లేదంటే మహేష్ స్పైడర్ గ్లింప్స్ చూసి సినిమాలో స్పైడర్ (రోబోటిక్ సాలె పురుగు) లేదు అన్నట్టు మారేలా ఉంది పరిస్థితి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు