మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన తాజా సంచలన హిట్ చిత్రమే ‘ఇరుముడి’. దర్శకుడు శివ నిర్వాణ భక్తి, ఎమోషన్, థ్రిల్ వంటి అంశాలు బలంగా జోడించి చేసిన ఈ సినిమా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా పాగా వేసింది. అయితే ఫైనల్ గా ఈ సినిమా నేటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
అయితే థియేటర్స్ లో ఓ రేంజ్ హిట్ అండ్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చాక కూడా దాదాపు మంచి టాక్ నే సొంతం చేసుకుంది. కానీ ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ మాత్రం ఇందులోని కంటెంట్ ని తీసుకోలేకపోతున్నామని సోషల్ మీడియాలో చెబుతున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఈ చిత్రం కోసం బేసిక్ ఐడియా లేని వారు చూసి పెదవి విరుస్తున్నారు.
సినిమా విడుదలకి ముందే శివ నిర్వాణ ఇది పూర్తి స్థాయి భక్తి సినిమా కాదు, ఓ సున్నితమైన అంశంపై తీసామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అవేమి పట్టించుకోని ఆ కొందరు ఆడియెన్సే ఇరుముడి లో సీన్స్ ఇలా ఉన్నాయ్ అలా ఉన్నాయ్ అంటూ సోషల్ మీడియాలో మిడిమిడి అవగాహనతో కామెంట్స్ చేస్తున్నారు.
అయితే వీటికి ఫ్యాన్స్ నుంచి కూడా ప్రతిస్పందనలు కూడా అంతే ధీటుగా వస్తున్నాయి. సో ఇలా ఇరుముడి ఓటీటీ లోకి వచ్చాక యునానిమస్ పాజిటివ్ స్పందన మాత్రమే కాకుండా అక్కడక్కడా నెగిటివ్ కామెంట్స్ కూడా అందుకుంటుంది.


