‘దీవాన’ పై శ్రీ విష్ణు ధీమా.. 1+1 ఆఫర్ ఇచ్చిన హీరో..!

‘దీవాన’ పై శ్రీ విష్ణు ధీమా.. 1+1 ఆఫర్ ఇచ్చిన హీరో..!

Published on Jun 26, 2026 4:20 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన లేటెస్ట్ చిత్రం ‘దీవాన’ ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. స్మేహ మణిమేగలై హీరోయిన్‌గా.. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకుడిగా ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయయ్యారు. ఈ నేపథ్యంలో చిత్ర థ్యాంక్యూ మీట్‌ను హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘ప్రొడ్యూసర్ విద్య గారు, వాసు గారి ఆహ్వానం మేరకు ‘దీవాన’ సినిమా చూశాను, చాలా బాగుంది. ఝాన్సీ, నరేష్‌ల పర్‌ఫెక్ట్ యాక్టింగ్, డీవోపీ, మ్యూజిక్‌తో పాటు ఎప్పుడూ చూడని రేంజ్ ఇంటర్వెల్ ట్విస్ట్, హీరో హర్షిత్ సహజ నటన అద్భుతంగా ఉన్నాయి. డైరెక్టర్ శ్రీకాంత్ లవ్ స్టోరీలోనే కాకుండా లైఫ్ డెప్త్‌ను, హార్ట్ టచింగ్ క్లైమాక్స్‌ను ఎంతో మెచ్యూర్డ్‌గా చూపించారు. గీతా ఆర్ట్స్ సపోర్ట్ ఉన్న ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీ మూవీని అందరూ ప్రోత్సహించాలి. నా వంతు మద్దతుగా, రేపు శనివారం ఏపీ, తెలంగాణల్లో ప్రతి ఊర్లో ఫస్ట్ 25 టికెట్స్ కొనేవారికి మరో టికెట్ ఫ్రీగా ఇస్తున్నాం. ఒకవేళ మీ టైమ్ వేస్ట్ అయ్యింది అనిపిస్తే, నెక్ట్స్ నా సినిమా వచ్చినప్పుడు వడ్డీతో కలిపి ఇచ్చేస్తాననే నమ్మకంతో చెబుతున్నా, తప్పకుండా థియేటర్లలో చూడండి.’ అని అన్నాడు.

డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి మాట్లాడుతూ.. ‘నాకు జీవితాన్నిచ్చిన నిర్మాతలు వాసు, శ్రీదేవి గారలకు, అండగా నిలిచిన మీడియాకు ధన్యవాదాలు. ‘దీవాన’ సినిమాను దెబ్బతీయాలని చూసినా, నా రైటింగ్ పవర్, డీవోపీ వంశీ విజువల్స్, నటీనటుల ప్రతిభ వల్ల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని గుండెల్లో పెట్టుకున్నారు. 100 కోట్ల బడ్జెట్ సినిమాల్లో కూడా లేని అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ ఈ చిన్న చిత్రంలో ఉంది. ఐదు రోజుల్లో ఐదుసార్లు చూస్తున్న ప్రేక్షకులు కూడా ఉన్నారు. అందుకే ఈ వైవిధ్యమైన సినిమాను చిన్న టీవీల్లో కాకుండా, మీ పిల్లలతో కలిసి థియేటర్లలోని బిగ్ స్క్రీన్‌పైనే చూసి ఆస్వాదించండి.’ అన్నారు.

ప్రొడ్యూసర్ శ్రీదేవి కార్యంపూడి మాట్లాడుతూ.. ‘మా సినిమా థ్యాంక్యూ మీట్‌కు విచ్చేసిన శ్రీవిష్ణు గారికి, ఎల్లప్పుడూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న అల్లు అరవింద్ గారికి, ప్రొడ్యూసర్ విద్యా అక్కకు ప్రత్యేక కృతజ్ఞతలు. నరేష్ గారి క్యారెక్టర్‌కు థియేటర్లలో భారీ రెస్పాన్స్ వస్తోంది. లేడీ ప్రొడ్యూసర్స్ నిర్మించిన అద్భుతమైన చిత్రాల్లో ‘దీవాన’ ఒకటంటూ ప్రశంసించిన జర్నలిస్ట్ ప్రేమ గారికి ధన్యవాదాలు. ట్రైలర్ లాంచ్‌లో చెప్పినట్లే మున్నా, అమ్ము పాత్రలు ప్రేక్షకులను నవ్విస్తూ, ఏడిపిస్తూ వారితో ప్రేమలో పడేలా చేస్తున్నాయి; అందుకే ఆడియెన్స్ స్వచ్ఛందంగా ఎన్నో రీల్స్ చేస్తూ సినిమాను వైరల్ చేస్తున్నారు. మేమంతా గర్వపడేలా, ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మంచి సినిమాను అందించాం.’ అని అన్నారు.

ప్రొడ్యూసర్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ – ‘దీవాన’ సినిమాకు కథే హీరో; మా టెక్నికల్ టీమ్, అలాగే అండగా నిలిచిన అల్లు అరవింద్ గారు, విద్యా అక్క ఈ కథకు ప్రాణం పోశారు. ఒక పెళ్ళి చూపులు, కేరాఫ్ కంచరపాలెం లాగా ఎప్పుడో ఒకసారి వచ్చే ఈ బ్యూటిఫుల్ మూవీ ఇప్పట్లో ఓటీటీలోకి రాదు. అందరికీ అందుబాటులో ఉండేలా సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, పీవీఆర్ స్క్రీన్స్‌లో రూ.105 కే టికెట్ ధరలు పెట్టాం కాబట్టి, రెండున్నర గంటల ఈ అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ను తప్పకుండా థియేటర్లలోనే చూసి ఎంజాయ్ చేయండి.’ అని అన్నారు.

హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘దీవాన సినిమా ఒక మిరాకిల్ బేబి లాంటిది. పెద్ద స్టార్ పవర్ లేకపోయినా, అంతా కొత్తవాళ్లమే చేసినా ఫస్ట్ వీక్ తర్వాత కూడా థియేటర్లలో 70% ఆక్యుపెన్సీతో రన్ అవ్వడమే మా నిజమైన సక్సెస్. నా మొదటి సినిమా ప్రొడ్యూసర్ సమంత గారి సూపర్ హిట్ చిత్రంతో పాటే మా సినిమా కూడా విజయవంతంగా ఆడటం, ప్రేక్షకులు ప్రతి పాత్రను ఓన్ చేసుకోవడం మాకు గర్వంగా ఉంది. ఒక రోజు ఆలస్యంగా (జూన్ 20న) విడుదలైనా ఆడియెన్స్ అద్భుతంగా ఆదరిస్తున్నారు; ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుందని చెబుతూనే ఎక్కడా స్పాయిలర్స్ ఇవ్వకుండా సినిమాను ప్రేక్షకులే కాపాడుతున్నారు. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడదగ్గ ఈ అరుదైన బ్యూటిఫుల్ మూవీని అందరూ థియేటర్లలోనే చూసి ఎంజాయ్ చేయండి.’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో నటుడు వీకే నరేష్, నటుడు రఘు కారుమంచి, డీవోపీ వంశీ పచ్చిపులుసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మహేశ్, ఎడిటర్ హృషికేశ్ పాస్పల్, మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ చంద్, లిరిసిస్ట్ అలరాజు తదితరులు పాల్గొని మాట్లాడారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు