‘విశ్వనాథ్ & సన్స్’ కోసం గాయకుడిగా మారిన స్టార్ హీరో ?

‘విశ్వనాథ్ & సన్స్’ కోసం గాయకుడిగా మారిన స్టార్ హీరో ?

Published on Jun 29, 2026 1:00 PM IST

తమిళ హీరో సూర్య ‘కరుప్పు’ విజయంతో జోరుమీదున్నాడు. ప్రస్తుతం తన తదుపరి సినిమా ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి ఆయన రెడీ అవుతున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటిస్తోంది. ఐతే, సూర్య అభిమానుల కోసం సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఈ చిత్రం కోసం సూర్య ఒక ప్రత్యేకమైన డ్యాన్స్ నంబర్‌ను (పాటను) పాడారని ఆయన వెల్లడించారు.

‘యూత్’ సినిమాతో గుర్తింపు పొందిన నటుడు, దర్శకుడు మరియు గీత రచయిత కెన్ కరుణాస్ ఈ పాటను రచించారు. 2014లో వచ్చిన ‘అంజన్’ చిత్రంలోని ‘ఏక్ దో తీన్’ పాట తర్వాత, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతంలో సూర్య మళ్లీ గాయకుడిగా మారడం విశేషం. ఈ వార్త మొత్తానికి సూర్య అభిమానులలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. సూర్య పాడిన పాటను వినడానికి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిత్ర బృందం త్వరలోనే ఈ పాట విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

ఈ సినిమాలో రవీనా టాండన్, రాధిక శరత్‌కుమార్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను జూలై నెలలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా 2026 ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది.

తాజా వార్తలు