‘వారణాసి’ నుంచి రామాయణ సర్ప్రైజ్ అప్పుడా?

‘వారణాసి’ నుంచి రామాయణ సర్ప్రైజ్ అప్పుడా?

Published on Jul 7, 2026 3:04 PM IST

Varanasi

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా అలాగే పృథ్వీ రాజ్ సుకుమారన్ కలయికలో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ వారణాసి కోసం అందరికీ తెలిసిందే. ఇండియన్ సినిమా నుంచి నెక్స్ట్ బిగ్ థింగ్ గా ఈ సినిమా నిలవబోతుంది అని అందరికీ తెలుసు. ఇక ఈ సినిమాలో ఊహించని అంశాలు ఎన్నో ఉండగా అలాంటి వాటిలో ఎపిక్ రామాయణ ఎపిసోడ్ కూడా ఒకటి.

కేవలం దీనిపై మోషన్ టీజర్ మాత్రమే చూపించడం జరిగింది. అలాగే మహేష్ రాముడి గెటప్ కూడా రివీల్ చేయలేదు. అయితే ఈసారి ఆగస్ట్ 9న మహేష్ ఫ్యాన్స్ కి మహేష్ రాముని లుక్ రివీల్ అవుతుంది అంటూ కొన్ని రూమర్స్ ఇపుడు వైరల్ గా మారాయి. అయితే సినిమాలో ఉన్న బిగ్గెస్ట్ హైలైట్స్ లో ఇది ప్రధానమైంది. సో రాజమౌళి అంత త్వరగా దీనిని రివీల్ చేసేస్తారా లేక డైరెక్ట్ గా మహేష్ విశ్వరూపాన్ని థియేటర్స్ లోనే చూడాలని వదిలేస్తారా అనేది వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు