ఓటీటీలో కూడా దుమ్ము లేపుతున్న ‘పెద్ది’ గాడి బ్యాటింగ్!

ఓటీటీలో కూడా దుమ్ము లేపుతున్న ‘పెద్ది’ గాడి బ్యాటింగ్!

Published on Jul 10, 2026 7:00 AM IST

Peddii

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే పెద్ది. మంచి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్స్ లో రాణించింది. అలా బిగ్ స్క్రీన్స్ నుంచి నిన్ననే ఓటీటీలో విడుదల అయ్యిన ఈ సినిమా ఇక్కడ కూడా సాలిడ్ రెస్పాన్స్ తో అదరగొడుతుంది.

దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో సౌత్ భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా నిన్న వస్తే ఇవాల్టికి ఇండియా వైడ్ గా నంబర్1 స్థానంలో ట్రెండ్ అవుతున్న సినిమాగా నిలిచింది. దీనితో ఇక్కడ కూడా పెద్ది గాడి ర్యాంపేజ్ మామూలుగా లేదని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో దివ్యెందు, జగపతి బాబు అలాగే శివ రాజ్ కుమార్ తదితరులు నటించారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. వృద్ది సినిమాస్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు