మాసివ్ బుకింగ్స్ తో ‘లెనిన్’ ర్యాంపేజ్ మొదలు!

మాసివ్ బుకింగ్స్ తో ‘లెనిన్’ ర్యాంపేజ్ మొదలు!

Published on Jul 11, 2026 7:01 AM IST

Lenin

అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే “లెనిన్”. మంచి అంచనాలు నడుమ సాలిడ్ ప్రమోషన్స్ తో వచ్చిన ఈ సినిమా మొదటి ఆట నుంచే మంచి టాక్ ని ఆడియెన్స్ నుంచి సొంతం చేసుకుంది.

ఇక ఈ టాక్ తోనే కాకుండా బుకింగ్స్ పరంగా కూడా లెనిన్ ర్యాంపేజ్ చూపించాడు. డే 1 కి గడిచిన 24 గంటల్లో దాదాపు 2 లక్షల మేర టికెట్ సేల్స్ ఒక్క బుక్ మై షో యాప్ నుంచే మొదలు కావడం అనేది ఈ సినిమా విషయంలో ఆడియెన్స్ ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. సో ఈ వీకెండ్ లో రన్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా అక్కినేని నాగార్జున, సూర్య దేవర నాగవంశీ నిర్మాణం వహించారు.

తాజా వార్తలు