విడుదల తేదీ : జూలై 11, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : అథర్వ, ప్రీతి ముకుందన్, కయదు లోహర్, ఫహద్ ఫాజిల్, నట్టి, థమన్ ఎస్, నిహారిక, రక్షణ, ద్రవిడ్ సెల్వం మరియు ఇతరులు
దర్శకత్వం : ఆకాష్ బాస్కరన్
సంగీతం : థమన్ ఎస్
నిర్మాతలు : ఆకాశ్ భాస్కరన్
సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, CH సాయి
ఎడిటింగ్ : ప్రదీప్ ఇ రాఘవ
సంబంధిత లింక్స్ : ట్రైలర్
అథర్వా, ప్రీతి ముకుందన్, కయాదు లోహర్ లీడ్ రోల్స్‌లో ఆకాష్ బాస్కరన్ తెరకెక్కించిన చిత్రం ‘హృదయం మురళి’. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.
కథ:
హృదయ్ (అథర్వ) బాగా సిగ్గరి. చిన్నతనం నుండి తన ప్రేమను వ్యక్తపరచలేక తాను ప్రేమించిన అమ్మాయిలను మిస్ అవుతూ ఉంటాడు. టీనేజ్ లో సమంత (ప్రీతి ముకుందన్)ను చాలా డీప్ గా లవ్ చేసి.. ఆ విషయం ఆమెకు చెప్పలేక పోతాడు. ఆ తర్వాత అతని జీవితంలోకి ఆమూద (కయదు లోహర్) వస్తోంది. ఆమెను కూడా హృదయ అంతే లవ్ చేస్తాడు. కానీ ఆమెకు కూడా ఆ విషయం చెప్పలేకపోతాడు. ఇలా అతని జీవితంలోకి వచ్చిన ప్రతి అమ్మాయి.. తనకు ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో తన పాత జ్ఞాపకాలతో, భావోద్వేగాలతో అతను ఎలా తన లైఫ్ ను లీడ్ చేశాడు ?, అసలు తన ప్రేమను చెప్పుకోలేకపోవడానికి కారణం ఏమిటి ?, చివరికి తన జీవితంలోకి ఎవరు వచ్చారు ?, సమంత అతనికి మళ్లీ ఎలా కనెక్ట్ అయింది ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో అథర్వ చాలా సెటిల్డ్ గా కనిపించాడు. కామెడీ టైమింగ్ తో పాటు ఎమోషన్స్ తోనూ అథర్వ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. అథర్వ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, ఎమోషనల్ సీన్స్ లోనూ తన యాక్టింగ్ తో సినిమాకే హైలైట్ గా నిలిచాడు. ప్రీతి ముకుందన్ తో సాగిన లవ్ స్టోరీలోనూ అథర్వ తన టైమింగ్ తో ఆకట్టుకున్నాడు.
మరో హీరోయిన్ గా నటించిన కయదు లోహర్ మెప్పించింది. బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా సెటిల్డ్ గా నటిస్తూ ఆకట్టుకుంది. కీలక పాత్రలో నటించిన నట్టి మెప్పించాడు. ఫాహద్ ఫాజిల్ నటన సినిమాకి ప్లస్ అయింది. అతనికి హీరోకి మధ్య వచ్చే సన్నివేశం బాగుంది. ఇక ఫ్రెండ్ పాత్రలో నటించిన థమన్ ఎస్ కూడా బాగా నటించాడు. నిహారిక, రక్షణ, ద్రవిడ్ సెల్వం, ఏంజెలిన్, అంజు కురియన్, సుధాకర్, యశశ్రీ, జోనితా గాంధీ అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
దర్శకుడు ఆకాష్ బాస్కరన్ రాసుకున్న మెయిన్ థీమ్ అండ్ ఎమోషనల్ ఎపిసోడ్స్ అండ్ కొన్ని లవ్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఓ సిగ్గరి ప్రేమలో పడితే.. అతనికి అతని లవర్ కి మధ్య ఉండే బాండింగ్ చాలా బాగుంది. అలాగే, థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది.
మైనస్ పాయింట్ :
అథర్వ పోషించిన పాత్రను, ఆ పాత్ర తాలూకు లవ్ సెంటిమెంట్ ను బాగా డిజైన్ చేసుకున్న ఆకాష్ బాస్కరన్ కొన్ని చోట్ల అంతే స్థాయిలో ఈ ‘హృదయం మురళి’ సినిమా ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల కథనాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా రాసుకోవాల్సింది. అలాగే హీరో – మెయిన్ హీరోయిన్ మధ్య ప్రేమ కథను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి చూపించి ఉంటే సినిమాకి ఇంకా ప్లస్ అయ్యేది.
అయితే, రాసుకున్న కథను తెర పై చాలా క్లారిటీగా చాలా కలర్ ఫుల్ గా మేకింగ్ చేసిన దర్శకుడు ఆకాష్ బాస్కరన్, స్క్రీన్ ప్లేను మాత్రం కొన్ని చోట్ల స్లోగా నడిపాడు. కాకపోతే సినిమాలో చాలా భాగం ఎమోషనల్ గా అండ్ లవ్ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్ట్ గా నడిపినా.. కొన్ని సీన్స్ మాత్రం బోర్ గా సాగాయి.
సాంకేతిక విభాగం :
దర్శకుడు ఆకాష్ బాస్కరన్ కొన్ని సన్నివేశాలను లవ్ పరంగా అలాగే ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ తగ్గించాల్సింది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
తీర్పు :
‘హృదయం మురళి’ అంటూ వచ్చిన ఈ ఫీల్ గుడ్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాలో.. అథర్వ నటన, మెయిన్ థీమ్ అండ్ ఎమోషనల్ అండ్ లవ్ సీన్స్ బాగున్నాయి. క్లైమాక్స్ కూడా ఆకట్టుకుంది. ఐతే, కొన్ని సీన్స్ మాత్రం స్లోగా మరియు రెగ్యులర్ గా సాగాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో నటీనటుల నటనతో పాటు సాంకేతిక విభాగం అందించిన మంచి పనితనం, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team


