ఐకాన్ స్టార్‌తో మలయాళ డైరెక్టర్ మూవీ.. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే..?

ఐకాన్ స్టార్‌తో మలయాళ డైరెక్టర్ మూవీ.. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే..?

Published on Jul 15, 2026 6:59 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అట్లీ డైరెక్షన్‌లో రాకా చిత్రంలో నటిస్తున్న బన్నీ, ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తన నెక్స్ట్ చిత్రాన్ని రూపొందిస్తాడు. ఇక ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత బన్నీ మలయాళ దర్శకుడు కమ్ యాక్టర్ బాసిల్ జోసెఫ్‌తో సినిమా చేయబోతున్నాడనే టాక్ గతకొంత కాలంగా వినిపిస్తోంది.

అయితే, ఇప్పుడు ఈ వార్తలను దాదాపుగా కన్ఫర్మ్ చేశాడు బాసిల్ జోసెఫ్. తాజాగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘ఐకాన్’ అనే పేరు రాసి ఉన్న క్యాప్ ఫోటోను షేర్ చేశాడు. అంతేగాక, బ్యాక్‌గ్రౌండ్‌లో బన్నీ నటించిన ‘ఆర్య-2’ సినిమాలోని ‘రింగా రింగా’ సాంగ్‌ను యాడ్ చేశాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఇక ఈ కాంబో ఫిక్స్ అయినట్లే అని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు.

‘మిన్నల్ మురళి’ ఫేమ్ దర్శకుడు బాసిల్ జోసెఫ్‌తో బన్నీ ఒక భారీ సోషియో-ఫాంటసీ సినిమా తెరకెక్కిస్తాడనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు