త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘ఈషా’ గతేడాది చివర్లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. హారర్ జోనర్ లవర్స్‌కు ఈ మూవీ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
అయితే, ఇప్పుడు ఈ మూవీ మరో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఈ సినిమాకు మరింత రీచ్ వస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిరి హనుమంతు, పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. నటీనటుల పర్ఫార్మెన్స్ మరియు దర్శకుడు స్క్రీన్‌ప్లేను నడిపించిన తీరు ఈ హారర్ థ్రిల్లర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


