‘లెనిన్’ కలెక్షన్స్‌పై నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ మార్క్ కోసమే..!

‘లెనిన్’ కలెక్షన్స్‌పై నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ మార్క్ కోసమే..!

Published on Jul 16, 2026 2:00 AM IST

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో, గుంటూరులో ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ కలెక్షన్స్‌ను ఉద్దేశించి చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ సినిమా అఖిల్ కెరీర్‌లోనే మొదటి రూ.100 కోట్ల వసూళ్ల చిత్రంగా నిలుస్తుందని తాను గట్టిగా నమ్మాడని.. మొదటి వారం కలెక్షన్స్ చాలా అద్భుతంగా వచ్చాయని.. తన మాటలను నమ్మి సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ వీకెండ్‌లో కొత్త తెలుగు సినిమాలేవీ విడుదల కావడం లేకపోవడంతో ప్రేక్షకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్లలో ఈ సినిమాను చూసి, ‘లెనిన్’ రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరేలా మద్దతు ఇవ్వాలని ఆయన కోరాడు.

మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, అక్కినేని నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా, తాజా సక్సెస్ మీట్ వ్యాఖ్యలతో ట్రేడ్ వర్గాల్లో మరింత హాట్ టాపిక్‌గా మారింది.

తాజా వార్తలు