సూపర్‌స్టార్ రజనీకాంత్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ తెలుగు థియేట్రికల్ రైట్స్‌కు మార్కెట్‌లో ఊహించని డిమాండ్ ఏర్పడింది. మొదటి భాగం ‘జైలర్’ తెలుగు రాష్ట్రాల్లో సాధించిన భారీ వసూళ్లను దృష్టిలో పెట్టుకుని, నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సీక్వెల్ రైట్స్ కోసం రికార్డు స్థాయి ధరను కోట్ చేస్తోంది. అయితే, ఈ భారీ ధర కారణంగా తెలుగు బిజినెస్ డీల్ ఇంకా అధికారికంగా క్లోజ్ కాలేదు.
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా కానుకగా 2026 అక్టోబర్ 15న థియేటర్లలోకి రానుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఎస్.జె. సూర్య కీలక పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ క్యామియో రోల్‌లో కనిపించనుండటం విశేషం. ఈ చిత్ర డిజిటల్ రైట్స్ కూడా ఇప్పటికే రికార్డు ధరకు అమ్ముడయ్యాయి.


