విడుదల తేదీ : జూలై 17, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : రుత్విక్, విశాఖ ధీమాన్, డాక్టర్ నరేష్ విజయ్ కృష్ణ, తదితరులు.
దర్శకత్వం : అనిల్ బోయిడపు
నిర్మాతలు : నిహారిక దాసరి
సంగీతం : మార్క్ కే రాబిన్,
ఛాయాగ్రహణం : మార్క్ కే రాబిన్,
కూర్పు : సాయిబాబు తలారీ
సంబంధిత లింక్స్ : ట్రైలర్
రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన సినిమా ‘రాజా ది రాజా’. అనిల్ బోయిడపు దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :-
రాజా (రుత్విక్) తానొక ఫ్యాషన్ డిజైనర్ కావాలని గోల్ పెట్టుకుంటారు. అది అతని తండ్రికి (డాక్టర్ నరేష్ విజయ్ కృష్ణ) ఇష్టం ఉండదు. తన లక్ష్యాన్ని సాధించే క్రమంలో అరవింద్ కృష్ణ (అవసరాల శ్రీనివాస్) కంపెనీలో రాజా జాబ్ సంపాదిస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో రాజా జీవితంలోకి ఆద్య (విశాఖ ధిమాన్) వస్తోంది. తన డిజైన్స్‌కి ఆద్యేనే కరెక్ట్ అని ఫిక్స్ అవుతాడు. అసలు ఆద్య ఎవరు ?, ఆమెకు మణిగడ్‌కి చెందిన రాజ్యానికి సంబంధం ఏమిటి ?, అప్పుడు వారి ప్రేమ కథలో జరిగిన డ్రామా ఏమిటి ?, మళ్లీ ఇప్పుడు వారిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది ?, వాళ్ళు ఎలా కలిశారు ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన రుత్విక్ పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన పీరియాడిక్ ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ముఖ్యంగా తన ఫాదర్ కి – రుత్విక్ పాత్రకి మధ్య జరిగే డ్రామా.. ఇలా మొత్తానికి ఈ సినిమా కొన్ని చోట్ల పర్వాలేదు. ముఖ్యంగా ఫ్యామిలీ టోన్ తో సాగే ఎమోషనల్ సీన్స్ అండ్ మిగిలిన లవ్ సీక్వెన్స్ లు అండ్ పీరియాడిక్ సీక్వెన్స్ వంటివి సినిమాకి ప్లస్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన రుత్విక్ తన పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు.
అలాగే, మరో కీలక పాత్రలో నటించిన డాక్టర్ నరేష్ విజయ్ కృష్ణ కూడా చాలా బాగా నటించారు. ఇక అవసరాల శ్రీనివాస్, విష్ణు ఓఐ నటన కూడా చాలా బాగుంది. అలాగే మరో పాత్రలో నటించిన పార్వతీశం కూడా మెప్పించాడు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను దర్శకుడు బాగా తీశాడు. యూత్ కు సంబంధించిన భావోద్వేగాలను బాగా హ్యాండిల్ చేశాడు.
మైనస్ పాయింట్స్ :
ఈ ‘రాజా ది రాజా మూవీ’ స్క్రీన్ ప్లే స్లో గా సాగింది. పైగా కొన్ని సన్నివేశాలు సింపుల్ అనిపించడం, అలాగే కాన్ ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం, ఇక మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరో రుత్విక్ క్యారెక్టర్ తాలూకు జర్నీ గ్రాఫ్ కూడా బాగాలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.
అయితే దర్శకుడు అనిల్ బోయిడపు పనితనం సినిమా పై ఆసక్తిని కలిగించినప్పటికీ… అదే విధంగా ఆయన రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ.. కథ కథనాలు ఇంట్రెస్ట్ గా సాగకపోవడం, ఉన్న సీన్స్ కూడా రెగ్యులర్ గా సాగడం కూడా బాగాలేదు. ఇక కొన్ని సీన్స్ సరిగ్గా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వవు.
మొత్తానికి అనిల్ బోయిడపు సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తర్వాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశాడు. మొత్తమ్మీద ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో కొన్ని కామెడీ సీన్స్, కొన్ని సెంటిమెంట్ ఎలిమెంట్స్ పర్వాలేదు. ఓవరాల్ గా అవసరానికి మించిన స్లో సన్నివేశాలు లేకుండా ఉంటే బాగుండేది. అలాగే స్క్రిప్ట్ లో ఇంట్రెస్టింగ్ సీన్స్ ను రాసుకుని ఉండాల్సింది.
సాంకేతిక విభాగం :
సినిమాలో చెప్పాలనుకున్న మెయిన్ కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు మార్క్ కే రాబిన్ సమకూర్చిన పాటలు జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ రవికిరణ్ బోయిడపు వాటిని తెరకెక్కించిన విధానం బాగుంది. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఈ చిత్ర నిర్మాత పాటించిన నిహారిక నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
‘రాజా ది రాజా మూవీ’ అంటూ వచ్చిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నా… ఈ సినిమా మాత్రం మెప్పించలేకపోయింది. కథ కథనాలు స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా.. సినిమా మాత్రం కనెక్ట్ కాదు.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team


