అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా భాగ్యశ్రీ హీరోయిన్ గా నటించిన పీరియాడిక్ ఎమోషనల్ యాక్షన్ డ్రామానే లెనిన్. డీసెంట్ బజ్ నడుమ రిలీజ్ కి వచ్చి సూపర్ హిట్ అయ్యిన ఈ సినిమాకు ఆల్రెడీ మేకర్స్ ఓ సక్సెస్ మీట్ ని గుంటూరు లో పెట్టారు. అయితే దీనికి ఇతర అక్కినేని హీరోలు లేకుండా సినిమా టీం వరకు చేశారు.
అయితే ఇప్పుడు రెండో సక్సెస్ మీట్ పై బజ్ వినిపిస్తోంది. దీనిని మేకర్స్ ఈ జూలై 20న లాక్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఈవెంట్ కి నాగ చైతన్య ముఖ్య అతిథిగా వస్తాడట. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు అలాగే అక్కినేని నాగార్జున మరియు నాగవంశీ లు నిర్మాణం వహించిన సంగతి అందరికీ తెలిసిందే.


