తెలుగు సినిమా దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవితో వర్క్ చెయ్యాలని ఎవరికి మాత్రం ఉండదు? అలానే ఎంతోమంది దర్శకులు, నటులు, నిర్మాతలు ఎంతోకాలంగా తమ సమయం కొరకు వేచి ఉన్నారు. అయితే తెలుగులో తీస్తే తన తొలి సినిమా మెగాస్టార్ చిరంజీవితోనే తీయాలని డిసైడ్ అయ్యి అనుకున్నట్టే చేస్తున్నాను అని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రముఖ నిర్మాత వెంకట్ కే నారాయణ.
కన్నడ ఇండస్ట్రీలో సహా పాన్ ఇండియా లెవెల్లో పలు భారీ సినిమాలు చేస్తున్న ఈ నిర్మాత తమిళ్ లో మొదటి సినిమాగా జన నాయగన్ చేస్తున్నారు. తెలుగులో మొదటి సినిమాగా మెగాస్టార్ 158వ సినిమా చేస్తున్నారు. అయితే మెగాస్టార్ తో సినిమా ఏ రేంజ్ లో లాంచ్ చేసారో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కనీ వినీ ఎరుగని రీతిలో అత్యంత గ్రాండ్ గా ఈ కార్యక్రమాన్ని తాము చేసారు. ఇక్కడే తనకి మెగాస్టార్ అంటే చిన్నప్పటి నుంచీ ఎంత ఇష్టం ఉంది అనేది అర్ధం అవుతుంది. ఇక సినిమాని కూడా అంతే గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్నారు. సో ఈ సినిమా అవుట్ పుట్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.


