ఇప్పుడు ఒక్క తమిళ సినిమా నుంచే కాకుండా దక్షిణాది సినిమా ఇండస్ట్రీ మొత్తంలో కూడా ఒక స్పెషల్ సినిమా రాక కోసమే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కోలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరైన విజయ్ హీరోగా నటించిన ఆఖరి సినిమా ‘జన నాయగన్’ ఇప్పుడు జూలై 23 విడుదలకి రాబోతుంది. ఓ హీరో సీఎం గా అయ్యిన తర్వాత వస్తున్న అరుదైన సినిమాగా జన నాయగన్ నిలిచింది.
ఇదొక్కటే కాకుండా సినిమా ఆల్రెడీ లీక్ అవ్వడం, సెన్సార్ కాకుండా ఎన్నో ఇబ్బందులు ఇలా చాలానే అడ్డంకులు తర్వాత జన నాయగన్ రాబోతున్నాడు. విజయ్ కి ఉన్న స్టార్ పవర్ తో ఈ సినిమా ఓపెనింగ్స్ పై అందరి కళ్ళు పడ్డాయి. విజయ్ సీఎం అయ్యిన వెంటనే అంటే ఓ నెల వ్యవధి లోనే సినిమా వచ్చేసి ఉంటే హైప్, ఆ ఓపెనింగ్స్ మరో లెవెల్లో ఉండేవి. కానీ ఇప్పుడు కూడా దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి.
100 కోట్ల ఓపెనర్ గా జన నాయగన్ కి ఛాన్స్?
విజయ్ నటించిన గత చిత్రాలు లియో, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమాలు 100 కోట్లకి పైగానే ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పుడు జన నాయగన్ కి కూడా 100 కోట్ల ఓపెనింగ్స్ గ్యారెంటీ అనే టాక్ ప్రస్తుతం ట్రేడ్ సర్కిల్స్ లో నడుస్తుంది.
ఒక్క తమిళనాడు నుంచే 30 కోట్ల ఓపెనింగ్స్?
నిజానికి మన దగ్గరలా తమిళనాడు రాష్ట్రంలో ముందు రోజే ప్రీమియర్స్, తెల్లవారుజాము షోలు అదనపు హైక్స్ లాంటివి ఉండవు. సో ఈ లెక్కల్లోనే అక్కడ డే 1 వసూళ్లు ఈజీగా 30 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ తో ఈ సినిమా మొదలు కాబోతుంది అనే టాక్ వినిపిస్తుంది.
రెస్టాఫ్ వరల్డ్ నుంచే మిగతా వసూళ్లు..
విజయ్ సినిమాలకి కేరళ, ఓవర్సీస్ మార్కెట్ లలో భారీ క్రేజ్ అండ్ మార్కెట్ ఉంది. ఓవర్సీస్ లో అనేక దేశాల్లో ఈ సినిమాకి బుకింగ్స్ ట్రెండ్ బాగానే కొనసాగుతుంది. సో ఇక్కడ నుంచి మిగతా వసూళ్లు రావచ్చని అంచనా.
ఎక్కడ వీక్ గా ఉందంటే?
తెలుగు మార్కెట్ ని విజయ్ సంపాదించుకోడానికి చాలా సమయమే పట్టింది. కానీ అనూహ్యంగా జన నాయగన్ డబ్బింగ్ వెర్షన్ జన నాయకుడు కి మాత్రం తెలుగులో తన గత సినిమాలు రేంజ్ బుకింగ్స్ కనిపించడం లేదు. పైగా హిందీ మార్కెట్ లో కూడా ఇదే తంతు నడుస్తుంది. ఈ రెండే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా ఈ సినిమాకి వీక్ బుకింగ్స్ నే కొనసాగుతున్నాయి. సో ఇక్కడ జన నాయకుడు బలపడితే భారీ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ లు ఉన్నాయి.
సో ఓవరాల్ గా విజయ్ ఫేర్వెల్ సినిమాకి మంచి ఓపెనింగ్స్ దక్కే ఛాన్స్ ఉంది కానీ గత సినిమాలని మించి వసూళ్లు వస్తాయో లేదో అనేది కొంచెం డౌటే.. సో మేకర్స్ అఫీషియల్ గా వదిలే పోస్టర్ లో ఎంత ఉంటుందో చూడాలి.


