ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రిలీజ్ కి సిద్ధంగా ఉన్న చిత్రాల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రితికా నాయక్ హీరోయిన్ గా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన సాలిడ్ హారర్ కామెడి ఎంటర్టైనర్ చిత్రం “కొరియన్ కనకరాజు” కూడా ఒకటి. అనౌన్స్ చేసిన ప్రోమో తోనే మంచి ఎంటర్టైన్మెంట్ ని ప్రామిస్ చేసిన మేకర్స్ లేటెస్ట్ గా విడుదల చేసిన ప్రోమోతో కూడా అదరగొట్టారు.
సినిమాలో విలన్ గా ఎవరిని ప్లాన్ చేయాలా అని చూస్తూ కొరియన్ బాలయ్య డాన్ లీ ని పెడదాం అనుకుని కొరియన్ కిమ్చిని పెడుతున్నామని కమెడియన్ సత్యతో ఆ కొరియన్ నటుడితో ప్లాన్ చేసిన ప్రోమో ఫుల్ ఫన్ తో అదిరిపోయింది అని చెప్పాల్సిందే. ఇక సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ ఆగష్టు 7న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.
K-Drama ❎ K-Kaaram ✅ 😂 🌶️
🇮🇳 x 🇰🇷#KoreanKanakaraju in theatres from AUGUST 7th… pic.twitter.com/DYHz0X6WRE
— Varun Tej Konidela (@IAmVarunTej) July 22, 2026


