ఇప్పుడు భారతీయ సినిమా ఆడియెన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ ఎపిక్ చిత్రాల్లో బాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ సినిమా రామాయణ కూడా ఒకటి. దర్శకుడు నితీష్ తివారి, రణబీర్ కపూర్, సాయి పల్లవి ఇంకా యష్ లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గ్రాండ్ ట్రైలర్ ఇటీవల మీడియాకి స్పెషల్ గా స్క్రీనింగ్ వేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఫైనల్ గా ఆన్లైన్ లో ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురు చూస్తున్న ఆ రోజు ఇప్పుడు రానే వచ్చింది. కానీ సరిగ్గా ఆ బిగ్ డేట్ రానే వచ్చింది కానీ మేకర్స్ కి మరో ప్లాన్స్ ఉన్నాయి. ఊహించని విధంగా సినిమా ట్రైలర్ ని వాయిదా వేసి మరో డేట్ లో ఇస్తున్నామని షాకిచ్చారు. కానీ ఇక్కడ ఓ గుడ్ న్యూస్ షేర్ చేశారు. రామాయణ గ్లోబల్ రిలీజ్ కోసం హాలీవుడ్ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ తో కలిసినట్లు బిగ్ అప్డేట్ అందించారు. ఇది మాత్రం ఊహించని స్టెప్ అనే చెప్పాలి. అయితే ట్రైలర్ కొత్త డేట్ ఏంటి అనేది తర్వాత రివీల్ చేస్తామంటున్నారు. సో దాని కోసం ఎదురు చూడక తప్పదు.



