ఎట్టకేలకు ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

ఎట్టకేలకు ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

Published on Jul 24, 2026 9:01 PM IST

తమిళ నటుడు విజయ్ ఆంటోనీ నటించిన రీసెంట్ మూవీ ‘వంద దేవుళ్ళు’ జూన్ 19న థియేటర్లలో రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. పూర్తి ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఒకింత క్యూరియాసిటీ ఏర్పడింది. అయితే, టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ రోజులు రన్ సాగించలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ పార్ట్నర్‌ను లాక్ చేసుకుంది.

‘వంద దేవుళ్ళు’ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమవుతుంది. అతి త్వరలో ఈ చిత్రాన్ని డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు జీ5 ప్రకటించింది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.

శశి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో లిజోమోల్ జోస్, అజయ్ ధీషాన్, శ్వాసిక విజయ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమాను ఎప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకొస్తారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు