మహేష్ ‘వారణాసి’ పై లేటెస్ట్ అప్డేట్!

మహేష్ ‘వారణాసి’ పై లేటెస్ట్ అప్డేట్!

Published on Jul 25, 2026 10:19 AM IST

Varanasi

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ నే ‘వారణాసి’. గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో చేస్తున్న ఈ సినిమా మహేష్ పర్శనాలిటీకి ఒక పర్ఫెక్ట్ ఇంటర్నేషనల్ ఎంట్రీగా నిలుస్తుంది. అయితే ఈ సినిమాని మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తుండగా షూటింగ్ అంతా ప్రస్తుతం శరవేగంగా పూర్తవుతుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఇపుడు బయటికి వచ్చింది మేకర్స్ నెక్స్ట్ ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ వారంలోనే రామోజీ ఫిలిం సిటీలో అందుకు సంబంధించిన రిహార్సల్స్ కూడా మొదలు కానున్నాయట.

సో వారణాసి ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ తో వెళ్ళిపోతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో గ్లోబల్ నటి ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే కార్తికేయ, కే ఎల్ నారాయణ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు