నారా రోహిత్ రొటీన్ కు భిన్నంగా, సరికొత్త కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. చిమ్మిలి మణికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘సౌండ్ ఇంజనీర్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్‌తోనే ఈ సినిమా వైవిధ్యమైన వినోదాన్ని పంచబోతోందని స్పష్టమవుతోంది.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నారా రోహిత్ ప్రశాంతంగా యోగా, ధ్యానం చేస్తూ కనిపిస్తుండగా, ఆయన చుట్టూ ఉన్నవారు మాత్రం ఆయనకు ప్రతి చిన్న శబ్దం వినిపిస్తుందేమోనని భయపడుతున్నట్లు చూపించారు. పోస్టర్‌పై ఉన్న తెలుగు లైన్స్ ఈ పాత్రలోని ఎంటర్టైనింగ్ కోణాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తున్నాయి. నారా రోహిత్ చాలా హ్యాండ్సమ్‌గా, డాషింగ్‌గా కనిపిస్తూ మరోసారి ఒక డిఫరెంట్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నాడని నమ్మకాన్ని కలిగిస్తున్నాడు.
భరత్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి విలక్షణ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండటం విశేషం. ఆయన రీ-ఎంట్రీతో ఈ సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగాయి. టైటిల్ పోస్టర్‌తోనే భారీ ఆసక్తిని రేకెత్తించిన ‘సౌండ్ ఇంజనీర్’ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.


