2027లో మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పదా..?

2027లో మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పదా..?

Published on Jul 26, 2026 12:00 AM IST

Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది కాస్త నిరాశ కలిగించే వార్తే. ఎన్నో అంచనాల మధ్య ప్రకటించిన ఈ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ అనుకున్న దానికంటే ఆలస్యంగా, ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుకుమార్ స్క్రిప్ట్‌ను మరింత పకడ్బందీగా తీర్చిదిద్దుతుండటంతో ప్రీ-ప్రొడక్షన్‌కే ఎక్కువ సమయం పడుతోంది.

ఈ క్రమంలో షూటింగ్, భారీ పోస్ట్-ప్రొడక్షన్ పనుల వల్ల సినిమాను 2028లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
​ఈ పరిణామాల వల్ల 2027లో రామ్ చరణ్ నుంచి ఒక్క సినిమా కూడా థియేటర్లలోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. చరణ్ దృష్టి పూర్తిగా ఈ ప్రాజెక్ట్‌పైనే ఉండటంతో, మధ్యలో వేరే ఏ సినిమా చేసే సూచనలు లేవు.

దీంతో ‘పెద్ది’ తర్వాత అభిమానులు తమ అభిమాన కథానాయకుడిని వెండితెరపై చూడటానికి సుదీర్ఘ కాలం వేచి చూడాల్సి వస్తుంది. అయితే, అవుట్‌పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడని సుకుమార్ శైలిని చూస్తే, ఈ ఆలస్యాన్ని భరించి థియేటర్లలో మరో ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్‌ను చూడటానికి ఫ్యాన్స్ సిద్ధంగానే ఉంటారని భావించవచ్చు.

తాజా వార్తలు