ఈ ఓటిటిలోకి ‘పెద్ది’.. ఈసారి బ్యాలన్స్ వెర్షన్!

ఈ ఓటిటిలోకి ‘పెద్ది’.. ఈసారి బ్యాలన్స్ వెర్షన్!

Published on Jul 30, 2026 3:50 PM IST

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రమే ‘పెద్ది’. మంచి అంచనాలు నడుమ వచ్చి భారీ వసూళ్లు ఈ సినిమా సాధించింది. ఆ సినిమా తర్వాత నుంచి వచ్చిన సినిమాలు కూడా టాలీవుడ్ లో మంచి హిట్స్ గా నిలిచాయి. అయితే పెద్ది రిలీజ్ థియేటర్స్ నుంచి తదుపరి ఓటిటిలో వచ్చేసిన సంగతి తెలిసిందే.

దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాని మేకర్స్ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో మొదట అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ హిందీ వెర్షన్ పై క్లారిటీ లేదు. ఇక ఫైనల్ గా పెద్ది హిందీ వెర్షన్ కూడా విడుదలకి వచ్చేసింది. ఈ సినిమా హిందీ హక్కులు కూడా నెట్ ఫ్లిక్స్ వారే సొంతం చేసుకోగా అందులో ఇవాళ్టి నుంచి సినిమా అందుబాటులోకి వచ్చేసింది. సో ఈ ఇక నుంచి సినిమా రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు