‘ఒడిస్సీ’పై కమల్ హాసన్ ఫిదా.. ఏమన్నాడంటే..?

‘ఒడిస్సీ’పై కమల్ హాసన్ ఫిదా.. ఏమన్నాడంటే..?

Published on Aug 1, 2026 12:01 AM IST

Kamal-Haasan

హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ చిత్రం ‘ఒడిస్సీ’ చిత్రంపై యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తన రెస్పాన్స్ తెలియజేశాడు. సినిమా పట్ల ఎల్లప్పుడూ మక్కువ చూపే కమల్ హాసన్, ఈ చిత్రాన్ని వీక్షించిన అనంతరం నోలన్ మేకింగ్ శైలిని, టెక్నికల్ బ్రిలియన్స్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

వెండితెరపై ‘ఒడిస్సీ’ ఒక అద్భుతమైన అనుభూతిని అందించిందని ఆయన పేర్కొన్నాడు. సినిమా మేకింగ్‌లోని ప్రతీ అంశం తనను ఎంతగానో ఆకట్టుకుందని కమల్ తెలిపాడు. ముఖ్యంగా కథ చెప్పే విధానం, విజువల్స్ మరియు సౌండ్ డిజైనింగ్ ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయని అన్నాడు. సినిమా పరిశ్రమ సరిహద్దులను చెరిపివేస్తూ, ఇలాంటి విజువల్ వండర్స్‌ను తెరకెక్కించడం కేవలం నోలన్ వంటి విజనరీ దర్శకుడికే సాధ్యమని కమల్ హాసన్ కొనియాడాడు.

ప్రపంచ స్థాయి చిత్రాల నుంచి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలని కోరుకునే సినీ ప్రేమికులకు ‘ఒడిస్సీ’ ఒక గొప్ప ఉదాహరణ అని ఆయన అన్నాడు. కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటుడి నుండి ఇలాంటి అద్భుతమైన ప్రశంసలు రావడంతో ‘ఒడిస్సీ’ చిత్రంపై భారతీయ ప్రేక్షకుల్లోనూ, ముఖ్యంగా సినీ విశ్లేషకుల్లోనూ మరింత ఆసక్తి పెరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు